ఎంపీఓల జిల్లా సంఘం ఎన్నిక

by Sridhar Babu |
ఎంపీఓల జిల్లా సంఘం ఎన్నిక
X

దిశ, ఖమ్మం రూరల్​ : ఎంపీఓల జిల్లా సంఘాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి.వీరస్వామి, జనరల్​ సెక్రటరీగా టీవీఎల్​ఎన్​ శాస్త్రి, సహచర అధ్యక్షునిగా టి. కృష్ణ, ఉపాధ్యక్షులుగా డి. రాజేశ్వరి, కోశాధికారిగా జీవీఎస్​ నారాయణ, జాయింట్​ సెక్రటరీగా శ్రీదేవి, ఆర్గనైజింగ్​ సెక్రటరీగా ఎం. రామచంద్రరావుతో కూడిన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీవోల సంఘం అధ్యక్షుడు పి. వీరస్వామి మాట్లాడుతూ.. తన పై నమ్మకం ఉంచి ఈ పదవి కట్టబెట్టినందుకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. అనంతరం నూతన జిల్లా కమిటీని పలువురు అభినందించారు.



Next Story

Most Viewed