డ్వాక్రా బకాయిలను రద్దు చేయాలి

by Sridhar Babu |
డ్వాక్రా బకాయిలను రద్దు చేయాలి
X

దిశ, జూలూరుపాడు : డ్వాక్రా బకాయిలను రద్దు చేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వెలుగు ఆఫీస్ ముందు బుధవారం మహిళలు బైఠాయించారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో చేశారని, అసలే మహిళల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిపారు. ఆఫీసుకు పిలిపించి డబ్బులు కట్టకుంటే ఇండ్లకు ఇచ్చే కరెంటును ఆపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అధిక వడ్డీలు డ్వాక్రా మహిళలు భరించలేని పరిస్థితి ఉందని, బకాయిలను రద్దు చేయాల్సిందేనని వారు నినాదాలు చేశారు. కోట్లకు కోట్లు బడా బాబులు ఎగనామం పెడుతున్నా వారిపై ఎలాంటి చర్యలు లేవని, పేద మహిళలపై భారం వేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా స్థానిక సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు.



Next Story