- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కలెక్టర్ సారూ.. ఇదేం న్యాయం.. అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవడంలో అధికారుల ద్వంద్వ వైఖరి

దిశ, వైరా: వైరాలో పుట్టగొడుగుల వెలిసిన అక్రమ వెంచర్లపై చర్య తీసుకునే విషయంలో టీపీఓ ద్వందనీతిని ప్రదర్శిస్తున్నారు. ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి ఇంకో న్యాయంలా ఆయన పనితీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. డీటీసీపీ అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. వేసిన అన్ని అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోకుండా ఒక వ్యక్తిని టీపీవో బలి పశువుని చేశారని వైరాలో బహిరంగ చర్చ కొనసాగుతుంది. వైరా మున్సిపాలిటీలో ఆది నుంచి జరుగుతున్న అక్రమాలను టీపీఓ భాస్కర్ కప్పిపుచ్చుతుడటం పలు అనుమానాలకు తావిస్తోంది. స్వయానా జిల్లా కలెక్టర్ అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. కేవలం ఒకే వ్యక్తి చెందిన రెండు వెంచర్లపై చర్యలు తీసుకుని, మిగిలిన వారందరినీ వదిలివేశారు. నిబంధనలకు విరుద్ధంగా టీపీఓ భాస్కర్ పనిచేసి కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించారని వైరాలో ప్రచారం జరుగుతుంది. వైరాలో డీటీసీపీ అనుమతులు లేకుండా సుమారు పది వెంచర్లపైగా ఉండగా.. కేవలం రెండు వెంచర్లలో మాత్రమే రాళ్లు తొలగించింది టీపీఓ.
అక్రమ వెంచర్ల కథ ఇది..
డీటీసీపీ అనుమతి లేకుండా వైరాలో వేసిన అక్రమ వెంచర్లపై 'దిశ' దినపత్రికలో పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ గౌతమ్ అక్రమ వెంచర్ల పై చర్య తీసుకోవాలని టీపీఓ భాస్కర్‌ను ఆదేశించారు. దీంతో హడావుడి చేసిన టీపీఓ ఒకే వ్యక్తికి చెందిన న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల సమీపంలో ఒక వెంచర్, బీసీ కాలనీలోని మరో వెంచర్లో ప్లాట్లు సరిహద్దు తెలుపుతూ ఉన్న రాళ్లను తొలగించారు. న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల సమీపంలో ఉన్న మరో వెంచర్‌తో పాటు సోమవారంలోని వెంచర్, గండగల పాడులోని రెండు వెంచర్లు, తల్లాడ రోడ్‌లోని మరో వెంచర్, బ్రాహ్మణపల్లి లోని వెంచర్లపై కనీస చర్యలు తీసుకోలేదు. ఇవే కాక వైరాలోని పలు ప్రాంతాల్లో అనేక అక్రమ వెంచర్లు ఉన్నాయి. ఈ వెంచర్లన్నీటిలో రాళ్లు తొలగించకుండా కేవలం ఒకే వ్యక్తికి చెందిన రెండు వెంచర్లలపై చర్యలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ వైరా తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తాతో ఈ అక్రమ వెంచర్లపై విచారణ చేపడుతున్నారు. ఆమె విచారణలో కూడా వైరాలో అనేక వెంచర్లకు డీటీసీపీ అనుమతి లేదని తేలినట్లు సమాచారం. ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా అక్రమ వెంచర్ల వివరాలను కలెక్టర్‌కి ఇచ్చేందుకు నివేదిక తయారు చేస్తున్నారని సమాచారం. ఆమె నివేదిక కలెక్టర్‌కు చేరితే టీపీఓ ద్వంద నీతి బయటపడే అవకాశం ఉంది. వైరా లో ఉన్న అన్ని అక్రమ వెంచర్లలో టీపీఓ రాళ్లు తొలగించి ఉంటే వైరా ప్రజానీకం హర్షించి ఉండేవారు. కానీ, తన ఇష్టారాజ్యంగా టీపీఓ వ్యవహరించడంతో ప్రభుత్వ యంత్రాంగానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి డీటీసీపీ అనుమతి లేని అన్ని వెంచర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తొలగించిన రాళ్లను వెంటనే పాతారు..
వైరా లోని రెండు అక్రమ వెంచర్లలో ప్లాట్ల సరిహద్దు తెలుపుతూ.. వేసిన కొలత రాళ్లను ఇటీవల టీపీఓ జేసీబీతో తొలగించారు. అయితే వైరాలో డీటీసీపీ లేని అనుమతి లేని వెంచర్లు అనేకముండగా కేవలం మా వెంచర్ల లోని రాళ్లనే తొలగించారని.. ఆ వెంచర్ల యజమాని వ్యాఖ్యానిస్తున్నారు. టీపీఓ పీకిన రాళ్ళని రెండో రోజే ఆయా వెంచర్లలో పాతారు. వైరా మున్సిపాలిటీలో అధికారుల ద్వంద్వ నీతి వల్ల అక్రమార్కుల కూడా వారికి భయపడే పరిస్థితి లేకుండా పోయింది. తొలగించిన రాళ్ళను వెంటనే పాతిన కనీసం అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారుల ద్వంద్వ నీతి మారుతుందో.. లేదో వేచి చూడాలి.