కూసుమంచిలో ముమ్మరంగా డ్రైడే

by Sridhar Babu |
కూసుమంచిలో  ముమ్మరంగా డ్రైడే
X

దిశ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇండ్లల్లో నిల్వ ఉన్న మురుగు నీటిలో, సైడ్ డ్రైనేజీలలో దోమల నివారణకు ఆయిల్ పిచికారీ చేశారు. పాడుపడ్డ కూలర్లు, కుండలు,గాబులు, టైర్లలో నీరు నిల్వ లేకుండా బోర్లించారు.

ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం, దగ్గు, జలుబు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు అందించామని ఆశ కార్యకర్తలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే తమకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి సెక్టార్ విజయ భారతి, ఆశ కార్యకర్తలు నలగాటి రజిని కుమారి, నలగాటి విజయ కుమారి, ఏఎన్ ఎం వసంత, అంగన్వాడీ టీచర్లు పుష్పలత, లక్ష్మి కాంతమ్మ పాల్గొన్నారు.



Next Story