డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారికి భారతసేవారత్నఅవార్డు ప్రదానం..

by Sumithra |
డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారికి భారతసేవారత్నఅవార్డు ప్రదానం..
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారికి భారత సేవా రత్నఅవార్డు ప్రధానం చేశారు. ఈ అవార్డు 25 సంవత్సరాలుగా సమాజం పట్ల అచంచలమైన నిబద్ధతతో విద్య, సామాజిక కార్యక్రమాలలో సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా డాక్టర్ వూటుకూరి. శేషారత్నకుమారికి 14-మే-2023న ఈ అవార్డు సగర్వంగా అందజేశారు. నీతిఆయోగ్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ప్రైడ్ ఇండియా అవార్డ్స్-2023 వారి సహకారంతో సంయుక్త ద్వార్యంలో డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారిని అంకితభావంతో పని చేసేవారిని ప్రోత్సాహకంగా అందించబడుతుందని ప్రోత్సాహాన్ని అందించడం, ప్రేరేపించబడే పరిస్థితిని చూపినందుకు ప్రతిష్టాత్మకమైన భారత్ సేవా రత్న అవార్డుతో ప్రైడ్ ఇండియా అవార్డ్స్-2023 సత్కరించింది.

ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాధికులు, హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ బండి. పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి.అన్విద భారత సేవా రత్నఅవార్డు సాధించిన ప్రిన్సిపాల్ కు వర్చువల్ రియాలిటీ సిస్టమ్ ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అరుదైన విషయంగా భావిస్తూ తమ అభినందన సభలో శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్.వూటుకూరి, శేషారత్నకుమారి మాట్లాడుతూ సమాజం పట్ల తాను నిర్వహించిన బాధ్యతలను గుర్తింపుగా ఈ అవార్డు రావడంతో తనబాధ్యతలను ఇంకా ఎక్కువగా వ్యవహరించవలసి ఉంటుందని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అత్యున్నతమైనదిగా పరిగణించబడుతున్నఈ భారత సేవారత్న అవార్డు రావడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకువచ్చారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్.చెన్నుపాటి, విజయకుమార్ , కళాశాల చీఫ్ కౌన్సిలర్ కోటగిరి.వెంకటజవహర్, కళాశాల ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్.డియన్ వి.కృష్ణారెడ్డి, కళాశాల ఈఈఈ విభాగాధిపతి కోట.రామకృష్ణప్రసాద్, కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్.K.భాస్కర్ ముత్యాలు, కళాశాల సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్కే.యాకూబ్, కళాశాల ఈసీఈ విభాగాధిపతి డాక్టర్. పాముల శేఖర్ బాబు పాల్గొన్నారు. ఈ భారత సేవారత్న అవార్డు సాధించిన కళాశాల డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి ని కళాశాల ఫ్యాకల్టీ మెంబర్స్, విద్యార్థినీ, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.



Next Story