ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి

by Sridhar Babu |
ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి
X

దిశ, కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వే పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్రంలోని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఉప ముఖ్యమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశాల మేరకు జిల్లాలోని అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి ప్రారంభమైన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే లో భాగంగా ప్రతి ఎన్యుమరేటర్ ప్రతి కుటుంబం ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చెయ్యాలని ఆదేశించారు. సర్వేలో ప్రజల నుంచి వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పై అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు చేయాలని సూచించారు. సేకరించిన సమాచారాన్ని గోప్యతగా ఉంచాలని అన్నారు. ప్రతి ఎన్యుమరేటర్ సేకరించిన సమాచారం వారికి కేటాయించిన కేంద్రాల వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా సమాచారాన్ని నిర్దిష్ట సమయంలో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. సూపర్ వైజర్లు మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షించాలన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై ఎన్యుమరేటర్లు ఖచ్చితమైన వివరాలు సేకరించిందన్నారు.

సర్వే సమయంలో ఆధార్‌, ధరణి పాస్‌బుక్‌, పాన్, రేషన్ కార్డు, సెల్‌ఫోన్‌ నంబర్లు కూడా నమోదు చేయాలని సూచించారు. ఒక్కో కుటుంబ వివరాల సేకరణకు 10 నుంచి 20 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున పత్రాలు దగ్గర పెట్టుకుంటే ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు వివరాలు చెప్పడం సులభం అవుతుందని, మొత్తం వివరాలు పూర్తయ్యాక తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్లుగా కుటుంబ యజమాని సంతకం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, కలెక్టరేట్ ఏఓ రమాదేవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed