మా పొట్ట కొట్టకండి సారూ...

by Sridhar Babu |
మా పొట్ట కొట్టకండి సారూ...
X

దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో జీపీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీంతో బుధవారం పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ కార్మికులను సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు. రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో అధికారులు ప్రైవేట్ కూలీలను రంగంలోకి దింపారు. దీంతో ప్రైవేట్ కూలీలతో పనులు చేపిస్తున్న

ఈవో గజవల్లి హరికృష్ణ వద్ద తమ పొట్ట కొట్టకండి సారూ అంటూ గ్రామపంచాయతీ కార్మికులు ప్రాథేయపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మె 14 రోజుకు చేరడంతో అర్ధాకలితో ఉన్న తమకు ప్రైవేటు కార్మికులను తీసుకురావడం గోరుచుట్టుపై రోకలి పోటులా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్సై రాజేష్ కుమార్ సైతం పనులను అడ్డుకోవద్దని కోరినప్పటికీ.. ప్రైవేటు కార్మికులు పనులు చేయడానికి వీలు లేదని సమ్మెలో ఉన్న కార్మికులు పట్టుబట్టారు. దీంతో ప్రైవేట్ సిబ్బంది పనులను మానివేసి వెనుతిరిగారు.



Next Story