అధైర్య పడొద్దు... అండగా ఉంటాం

by Disha Web Desk 15 |
అధైర్య పడొద్దు... అండగా ఉంటాం
X

దిశ, మధిర : బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా నిలబడతామని జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిర పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కొండబాల కోటేశ్వరరావు తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిస్తే పొంగిపోయేది లేదని, ఓడితే కృంగిపోయేది లేదని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తెలిపారు. ప్రతి ఓటమి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోందని, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల మధ్యనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అన్ని విధాలా అండగా నిలబడతామని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందేలా నూతన ప్రభుత్వం పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐదు మండలాల నుండి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.Next Story