స్కూల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

by Sridhar Babu |
స్కూల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండల పరిధిలోని క్రిష్టారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పుట్టినరోజును పురష్కరించుకొని గ్రామ పెద్దలు కొడిమెల్ల అప్పారావు విద్యార్థులకు ప్లేట్లను స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొండా ప్రభుదాసుకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామంలోని విద్యార్థుల పురోగతిని కోరుకుంటూ వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక ఈశ్వర్, సొసైటీ చైర్మన్ మామిళ్లపల్లి కృష్ణయ్య, కొలపనేని ధనంజయ్ ,విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Next Story