సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

by Sridhar Babu |
సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లిలోని మాధురి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 164 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన రూ.87,38,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, సత్తుపల్లి మండలానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు రూ.32,03,712 విలువగల కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుతోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సొంత ఖర్చులతో పెళ్లికూతురుకు చీరను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనిహస రావు, ఎంపీడీఓ సుభాషిని ,మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మోనార్క రఫీ, ప్రధాన కార్యదర్శి మల్లూరు అంకం రాజు, పలువురు వార్డు కౌన్సిలర్లు అద్దంకి అనిల్, చాంద్ బాషా, తడికమల్ల ప్రకాశరావు, మందపాటి పద్మజ్యోతి, కంటే నాగలక్ష్మి, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed