- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్న 'దిశ': ఏసీపీ రెహమాన్
by Sathputhe Rajesh |

X
దిశ, వైరా: సమాజ హితం కోసం దిశ దినపత్రిక నిష్పక్షపాతంగా వార్తలు రాస్తోందని వైరా ఏసీపీ రెహమాన్ అన్నారు. వైరాలోని ఏసీపీ కార్యాలయంలో దిశ దినపత్రిక క్యాలెండర్‌ను ఏసీపి రెహమాన్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా రంగంలో దిశ దినపత్రిక అందిస్తున్న వార్త కథనాలు పత్రికా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఎప్పటి వార్త అప్పుడే వెబ్‌సైట్‌లో పొందుపరిచి పాఠకుల అభిమానాన్ని పొందుతోందని వివరించారు. దిశ పత్రిక మరింత అభివృద్ధి చెంది పాఠకులకు నిష్పక్షపాత కథనాలను మరిన్ని అందించాలని కోరారు. దిశ యాజమాన్యంతో తనకున్న సన్నిహిత సంబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దిశ వైరా నియోజకవర్గ ఇన్ ఛార్జి మేడా సంపత్, ఏసీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story