దిశ ఎఫెక్ట్…బ్లాక్ మెయిలర్ సంపత్ పై కేసు నమోదు

by Kalyani |
దిశ ఎఫెక్ట్…బ్లాక్ మెయిలర్ సంపత్ పై కేసు నమోదు
X

దిశ, కారేపల్లి: కారేపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బందిని వేధిస్తున్న కారేపల్లికి చెందిన సంపత్ కుమార్ పై కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదయింది. సైకో సంపత్ మోసాలు, అక్రమాల పై దిశ దిన పత్రికలో వచ్చిన వరుస కథనాలకు పోలీసులు స్పందించారు. సైకో సంపత్ పై కేసు నమోదు చేసి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పొట్టపింజర రాందాస్, మూడ్ మోహన్ జూనియర్ అసిస్టెంట్లు గా పనిచేస్తున్నారు. ఆలయం పక్కనే నివాసం ఉంటున్న సంపత్ కుమార్ అనే యువకుడు గుడి సిబ్బంది విధులకు ఆటంకపరుస్తూ వారిని రకరకాలుగా వేధిస్తున్నాడు. మూడ్ మోహన్, రాందాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి పోలీసులు సంపత్ పై కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed