- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘దిశ’ ఎఫెక్ట్.. బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖలో ఫిర్యాదు

దిశ, అశ్వారావుపేట టౌన్ : మండల వ్యాప్తంగా మద్యం బెల్టు దుకాణాలపై పట్టణ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్ళ కంటే మద్యం అందుబాటులో ఉండటం వల్ల యువత బానిసలై జీవితాలు పాడుచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 'దిశ' పత్రికలో ప్రచురితమైన కథనాలపై స్పందించిన యువకులు బెల్టు దుకాణాలను నియంత్రించాలంటూ ఆదివారం ఎక్సైజ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మీకు బెల్టు దుకాణాలు కనిపించకుంటే తమ వెంట రావాలని, అడుగుకో బెల్టు దుకాణం చూపిస్తామంటూ సవాల్ విసిరారు. అంతే కాకుండా మద్యం మాఫియా అధిక ధరలతో చేస్తున్న దోపిడిపై వివరించారు. గిరిజన నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట మండల వ్యాప్తంగా మద్యం విచ్చలవిడి విక్రయాలపై గత ఫిబ్రవరి 13వ తేదీన 'బెల్టు తీస్తారా...?, మార్చి 23న 'బెల్టు జోరు' శీర్షికన 'దిశ' దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఇందులో మండలంలోని బెల్ట్ దుకాణాలో సాగుతున్న విచ్చలవిడిగా మద్యం విక్రయాలు. అధిక ధరలతో మాఫియా దోడిపిని వివరించింది. అయినా సంబంధిత ఎక్సైజ్ అధికారులు కథనాన్ని ప్రచురించింది. అయినా సంబంధిత ఎక్సైజ్ ఇంత వరకు స్పందించలేదు. మా దృష్టికి రాలేదని తప్పించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం మద్యం బెల్టు దుకాణ నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. మిగతా అన్ని రోజుల్లో బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తూ మాఫియా దోడిపికి మద్దతిస్తున్నారు. గ్రామాల్లో మంచినీటి కంటే మద్యం ఎక్కువగా అందుబాటులో ఉండటం తో యువత ఎండల తీవ్రతగా దాహం తీర్చుకోవడానికి సరదా కోసం బీర్లు తాగుతూ చివరికి బానిసలవుతున్నారు. దీంతో వేల కుటుంబాలకు ఆర్థికంగా నష్టపోతున్నాయి. అయినా ఎక్సైజ్ అధికారుల్లో మాత్రం కనిపించడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడా బెల్టు దుకాణాలు లేవంటూ ప్రకటిస్తుంది. కానీ ఎక్సైజ్ అధికారులకు మాత్రం ఎందుకు కనిపించడం లేదో పరమార్ధం వారికే తెలియాలి.
స్పందించిన యువత..
అధికారులు నిర్లక్ష్యంగా ఉన్న బెల్ట్ దుకాణాల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలపై యువత స్పందించింది. తక్షణమే మండల వ్యాప్తంగా కొనసాగుతున్న మద్యం బెల్టు దుకాణాలను నియంత్రణకు స్థానిక ఎక్సైజ్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అడుగుకో బెల్టు దుకాణం, మద్యం అందుబాటులో ఉండటం తో యువత సరదా కోసం రుచి చూసి చివరకు బానిసలై ఆర్థికంగా చితికిపోతున్నారని ఎక్సైజ్ అధికారులను ఆశ్రయించారు. మద్యం బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకుని యువత జీవితాలను కాపాడాలంటూ వేడుకున్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి గతంలో ప్రచురితమైన కథనాలను జత చేశారు. ఇప్పటికైనా మీకు బెల్టు దుకాణాలు కనిపించకుంటే తమ వెంట రావాలని, ప్రతి అంగుళం లో ఉన్న బెల్టు దుకాణాలను చూపిస్తామని అధికారులకే ఏకంగా సవాల్ విసిరారు. అంతేకాకుండా మద్యం మాఫియా సిండికేట్ గా ఏర్పడి మందుబాబులను దోచుకుంటున్న తీరును వివరించారు.
నిత్యావసర సరుకులు, కూరగాయల ధరల కంటే మద్యం దోడిపి ఎక్కువగా ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట కూడా మద్యం ఏరులై పారుతోందని, బెల్టు దుకాణాల వల్లనే అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతకు గురవుతున్నారని అధికారుల తీరు పైపెదవి విరిశారు. బెల్టు దుకాణలను ప్రోత్సాహించడం లో అధికారుల నెలవారీ మామూళ్ళే ఒక కారణంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. బెల్టు దుకాణాలను నివారించడం వల్ల యువతతో పాటు వారి కుటుంబాలకు కనీస జీవిత భరోసా కలుగుతుందని విజ్ఞప్తి చేశారు.
బెల్టు దుకాణాలు తొలిగించే వరకు పోరాడతాం..
మండలంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగిస్తున్న బెల్ట్ దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తొలిగించే వరకు పోరాడతామని మండలంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగిస్తున్న బెల్ట్ దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తొలిగించే వరకు పోరాడతామని యువకులు మారిశెట్టి మణి, సాత్విక్, చందు, దారపు రెడ్డి సాయిచంద్లు స్పష్టం చేశారు. ప్రతి అడుగుకు ఒక బెల్టు దుకాణం ఉన్నా మా దృష్టికి రాలేదని అధికారులు చెప్పటం విడ్డూరంగా ఉందని, అందుకే తమ వెంట వస్తే బెల్టు దుకాణాలను చూపిస్తామని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. అంతేకుండా మద్యం మాఫియా అధిక ధరలతో చేస్తున్న దోడిపిని వివరించామని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని, అయినా స్పందించకుంటే ప్రత్యక్ష దాడులకు సిద్ధమవుతామని చెప్పారు. బెల్టు దుకాణాలతో మద్యం అందుబాటులో ఉండటం వల్ల యువత సరదా కోసం అలవాటు చేసుకుని బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.