నూతన ఆవిష్కరణకు దిశ ఓ వేదిక

by Sridhar Babu |
నూతన ఆవిష్కరణకు దిశ ఓ వేదిక
X

దిశ, తల్లాడ : నూతన ఆవిష్కరణకు దిశ ఓ వేదిక అని ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అన్నారు. తల్లాడలోని స్థానిక ఆర్పీ గార్డెన్ లో 2023 సంవత్సర దిశ క్యాలెండర్ ను ఎంపీపీ, స్థానిక టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. డిజిటల్ మీడియా రంగంలో దిశ నూతన వరవడితో ముందుకెళ్తుందని, గంటల వ్యవధిలోనే విశ్వసనీయమైన సమాచారం రాష్ట్ర నలుమూలకు చేరుతుందని, డైనమిక్ ఎడిషన్ లాంటివి అందించి ప్రజల ఆదరణ పొందిందన్నారు. సంచలన వార్తలను ఎప్పటికప్పుడు అందించడంలోనూ మిగతా పత్రికల కంటే ముందు వరుసలో ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా దిశ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తల్లాడ రిపోర్టర్ కరుణాకర్, కల్లూరు ఆర్సీ ఇంచార్జ్ అనిల్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి, వైరా మార్కెట్ చైర్మన్ దుపాటి భద్రరాజు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్, లాల్ , మండలంలోని సర్పంచులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed