Bhadrachalam : భద్రాచలం రామాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

by Kalyani |
Bhadrachalam : భద్రాచలం రామాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
X

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీ స్వామి వారికి పవిత్రోత్సవాలకు అంకురారోపణ నిర్వహించారు. పవిత్ర గౌతమి నది నుంచి మేళతాళాలతో, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ తీర్ధ జలాలు తీసుకుని వచ్చి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు.ఆచార్య, బ్రహ్మ, ఋత్వికులకు,వేద పారాయణ దారులకు దేవస్థానం అధికారులు దీక్షా వస్త్రాలు అందజేశారు. ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 15 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణాలు నిలిపివేశారు.

Advertisement

Next Story

Most Viewed