- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అంబేద్కర్ నగర్ లో పట్టపగలే చోరీ
by Kalyani |

X
దిశ,సత్తుపల్లి: సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామపంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీలో పట్టపగలు దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి నగదు తీసుకెళ్లిన సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కిష్టారం గ్రామపంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన పాగా వెంకటేశ్వరరావు, ఇంటి అవసరాల నిమిత్తం బీరువాలో భద్రపరిచిన రూ.1,09 500/- నగదు శనివారం పట్టపగలు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ .1,09.500/-నగదును అపహరించారు. మరుసటి రోజు ఆదివారం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story