అవినీతితో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు : వైరా ఎమ్మెల్యే

by Disha Web Desk 11 |
అవినీతితో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు : వైరా ఎమ్మెల్యే
X

దిశ,కారేపల్లి : తెలంగాణ వాదంను అడ్డం పెట్టుకోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిని అరికట్టి ఆరు గ్యారంటీల అమలుకు నడుంబిగించదని వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ అన్నారు. కారేపల్లి మండలంలో వైరా ఎమ్మెల్యే ఆదివారం వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబం కాళేశ్వరం పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారన్నారు. మేడిగడ్డ వద్ద డ్యామ్‌ కుంగి ప్రమాదపరిస్ధితులు ఉంటే దానికి ఏమి కాలేదు అంటూనే మరమ్మత్తులు వెంటనే చేయాలని కేటీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ అధికారం చేపట్టి హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు నడుం బిగించదన్నారు. ప్రజలలో కాంగ్రెస్‌ పలుకుబడి పెరగటం చూసి కేటీఆర్‌ వెరెత్తి పోతున్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలలు నాల్గుంటిని అమలు చేసి సత్తా చాటామన్నారు. మరో రెండు వారం రోజుల్లో అమలు చేస్తామన్నారు. చీమలపాడులో గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాద బాధితులను పరామర్శించారు. తమను పట్టించుకోవటం లేదని, మెడికల్‌ బిల్లులు చెల్లించలేదని కృతి కాలు ఇవ్వటం లేదని తేజావత్‌ భాస్కర్‌ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పింఛన్‌ కూడా రావటం లేదని ఇదేనా న్యాయం అంటూ ఎమ్మెల్యే ఎదుట రోధించారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కారేపల్లి మండల పరిధిలోని ఎర్రబోడు, మాణిక్యారం, చీమలపాడు. తవిసిబోడు, గేటురేలకాయలపల్లి, బస్వాపురం గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేపట్టనున్నా సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ ప్రారంభించారు. గృహ జ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకంతో మండలంలో 9 వేల మందికి లభ్ధిచేరుకుందన్నారు.

ఈకార్యక్రమంలో ఎంపీపీ మాలోత్‌ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్‌ జగన్‌, సోసైటీ చైర్మన్‌ దుగ్గినేని శ్రీనివాసరావు, సంత ఆలయ చైర్మన్‌ అడ్డగోడ ఐలయయ్య, డైరక్టర్‌ బానోత్‌ హీరాలాల్‌, ఎంపీటీసీ ఆలోత్‌ ఈశ్వరినందరాజ్‌, బానోత్‌ రమేష్‌, మాజీ ఎంపీపీబానోత్‌ దేవ్లానాయక్‌, పీసీసీ మహిళ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాశ్‌, ఎస్టీ సెల్‌ అధ్యక్షులు మేదరి వీరప్రతాఫ్‌, నాయకులు బానోత్‌ రాంమ్మూర్తి, వాంకుడోత్‌ గోపాల్‌, గుగులోత్‌ భీముడు, బోడా సెట్‌రాం, బానోత్‌ రూప్లా, కడియాల సుధాకర్‌, కుర్సం సత్యనారాయణ, చాగంటి చిన్నా, తోటకూరి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed