కన్నపేగు కర్కశత్వం

by Shiva |
కన్నపేగు కర్కశత్వం
X

నవజాత శిశువును ఇంటి రేకులపై వదిలి వెళ్లిన అజ్క్షాత వ్యక్తి

దిశ, పేట్ బషీరాబాద్: నవజాత శిశువును ఓ అజ్క్షాత వ్యక్తి రేకుల ఇంటిపై విడిచిపెట్టి వెళ్లిన ఘటన హృదయ విదారక ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీడిమెట్ల డివిజన్ అయోధ్య నగర్ రోడ్ నెం.14లో సుభాష్ అనే వ్యక్తికి చెందిన రేకుల ఇంటిపై నవజాత శిశువు స్పృహ లేని దశలో స్థానికులు గుర్తించారు. దీంతో ఎండకు ఆ చిన్నారి ఏడ్చి.. ఏడ్చి చివరకు ఊపిరాడక స్పృహ కోల్పోయింది. దీంతో బస్తీ వాసులు షాపూర్ నగర్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు శిశువును పరీక్షించి కొద్దిసేపు ఇంక్యూబేటర్ లో ఉంచినా ఫలితం లేకపోవడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. ఈ మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed