అంతటా కాంగ్రెస్ సునామి

by Disha Web Desk 15 |
అంతటా కాంగ్రెస్ సునామి
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మధిర నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమీప బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 27,889 ఓట్ల ఆదిక్యంలో ఉన్నారు. అలాగే ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యంలో ఉండగా, పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు 46,278 ఓట్లు ఆధిక్యం కొనసాగుతోంది. ఇక వైరాలో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ పై కాంగ్రెస్ అభ్యర్థి రామదాసు నాయక్ ముందంజలో ఉన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య పై కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి ముందంజలో ఉన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు 22169 ఓట్ల ఆధిక్యత తో ముందంజలో ఉన్నారు.

Next Story

Most Viewed