పార్టీ అవకాశమిస్తే ఎమ్మెల్యేగా గెలుస్తా: పూజ

by S Gopi |
పార్టీ అవకాశమిస్తే ఎమ్మెల్యేగా గెలుస్తా: పూజ
X

దిశ, దమ్మపేట: కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలతో సంబంధం లేకుండా పార్టీ కోసమే పనిచేస్తానని టీపీసీసీ సభ్యురాలు, యువ నాయకురాలు వగ్గేల పూజ అన్నారు. మంగళవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, అందులో ఈదడం చాలా కష్టం అయినప్పటికీ, తన తాతయ్య అయిన అశ్వారావుపేట దివంగత మాజీ ఎమ్మెల్యే వగ్గేల మిత్ర సేన రాజకీయ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నత చదువులను పక్కనపెట్టి రాజకీయాల్లోకి రావడం జరిగింది అని తెలిపారు. నియోజకవర్గంలో ఎప్పటికీ వగ్గలే కుటుంబం కాంగ్రెస్ తోనే ఉంటుందని, నియోజకవర్గ ప్రజలకు కూడా వగ్గేల కుటుంబాన్ని ఎంతో ఆదరిస్తారని, దివంగత మాజీ ఎమ్మెల్యే మిత్ర సేన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆమె తెలిపారు. అదే స్ఫూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి వస్తే నియోజకవర్గ అభివృద్ధితోపాటు, ప్రజల్లో జీవన విధానంలో మార్పు తీసుకురాగలరని తెలిపారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆమె తెలిపారు. నియోజకవర్గమంతా తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకుని వాటిని సాధించే విధంగా ముందుకు వెళ్తానని, వర్గాలతో కాకుండా పార్టీ కోసం పని చేస్తానని, రాబోయే ఎన్నికల్లో అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె తెలిపారు.



Next Story