- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అవినీతికి మారుపేరు కాంగ్రెస్
దిశ, ఖమ్మం టౌన్ : అవినీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని, దేశ అభివృద్ధి మోడీతోనే సాధ్యమని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు అన్నారు. బుధవారం రఘునాథపాలెం మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో కాంగ్రెస్ రెండూ అవినీతిలో కూరుకుపోయాయని అన్నారు. స్కాములకు కాంగ్రెస్ పెట్టింది పేరు అని దుయ్యబట్టారు. బీజేపీది నీతివంతమైన పాలన అని, ఎలాంటి అవినీతికి తావు ఇవ్వదని, మరోసారి మోడీ రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మోడీ ప్రభంజనం ఉందని, ఖమ్మంతో పాటు తెలంగాణలో 12 సీట్లు గెలవబోతుందని అన్నారు. మూడోసారి మోడీతో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని, ప్రజలు మోడీ పథకాలతో ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ బలం దేశంలో పెరిగిందని,
400 సీట్లు లభించే విధంగా ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. మోడీ ప్రవేశపెట్టిన ప్రతి పథకం సామాన్యుడికి లబ్ధి చేకూర్చిందని, ఆ పథకాలే ఖమ్మంలో గెలిపిస్తాయని పేర్కొన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఇప్పుడు త్రిబుల్ తలాక్ వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో ముస్లిం మహిళలకు బీజేపీ అండగా ఉందన్నారు. బీజేపీ అందించే ఎన్నో సంక్షేమ పథకాల వల్ల మహిళలు స్వయం ఉపాధితో జీవించవచ్చని తెలిపారు. మండల అధ్యక్షులు పొట్లపల్లి నాగేశ్వరావు, జిల్లా ఉపాధ్యక్షులు గుత్త వెంకటేశ్వర్లు, మండల ఇంచార్జి, జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి, అసంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, ఎం. ప్రభాకర్ రెడ్డి, జ్వాలా నర్సింహారావు, మండల ప్రధాన కార్యదర్శి భూక్యా బాలాజీ, హరిలాల్, సాయి, రాంబాబు పాల్గొన్నారు.