- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మద్యం మత్తులో విద్యార్థులు హల్ చల్.. కళాశాల ఎదుట..

దిశ, సత్తుపల్లి: మద్యం మత్తులో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం మండల పరిధిలోని గంగారం గ్రామంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదం కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. మొదటి సంవత్సరం E.E.E విభాగానికి చెందిన విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ మామిడితోటలో పార్టీ చేసుకుంటుండగా సీనియర్ విద్యార్థుల బృందం కూడా అక్కడ తారసపడడం, ఇరువర్గాల మధ్య మాటలు పెరగడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కళాశాల మెయిన్ గేటు ఎదురుగానే కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో కళాశాల యాజమాన్యం ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయం ఆదివారం వరకు వెలుగులోకి రాకపోవడం గమనార్హం. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న దాడిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.