- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దుమ్ము రేపిన శివ నాగులు జానపదం

దిశ ఖమ్మం కల్చరల్: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో శనివారం రాత్రి నిర్వహించిన జానపదం-మా ప్రాణపదం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ జానపద కళాకారుడు శివనాగులు తనదైన శైలిలో జానపద గీతాలు ఆలపిస్తూ.. నృత్యం చేస్తూ దుమ్మురేపాడు. శివనాగులు, స్నేహ బృందం గున్న గున్న మామిడి గీతంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. అమ్మలార అంటూ అంజి పల్లె గీతానికి నృత్యం చేస్తూ ప్రేక్షకులను అలరించారు. కోదాడ నరసింహారావు జానపద కళా ప్రదర్శన అదరగొట్టారు.
అలాగే షేక్ ఫకృద్దీన్, కొమ్ము రమ, నాగసాయి తదితర కళాకారులు జానపద గీతాలు నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎ.అశోక్ కుమార్ అధ్యక్షత వహించగా ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ ప్రదీప్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. జానపద కళలను ప్రోత్సాహించాలని కోరారు. ప్రముఖ రంగస్థల నటుడు జామ, పూర్ణ కంటి రామారావు, ఉపాధ్యాయులు షపి. విద్యాసాగర్, బాలు, సుందర్ ను ఘనంగా సత్కరించారు. కొమాకుల సీతారాములు, రౌతు రవి, ఎ ఎస్ కుమార్, కృష్ణ, సోమయ్య, ముత్తమాల ప్రసాద్, మొగిలి గుణకర్ తదితరులు పాల్గొన్నారు.