ఎంపీడీఓ కార్యాలయం ముందు ముస్లిం మైనార్టీల ఆందోళన

by Disha Web Desk 15 |
ఎంపీడీఓ కార్యాలయం ముందు ముస్లిం మైనార్టీల ఆందోళన
X

దిశ, వైరా : ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ముస్లిం మైనార్టీలు గురువారం వైరాలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మండల వ్యాప్తంగా సుమారు 246 మంది ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేందుకు అధికారులు గురువారం మండల పరిషత్ కార్యాలయానికి ఆహ్వానించారు. ఆ సమయంలో మండలం మొత్తం వికలాంగుల కోటాలో ఒక యూనిట్, జనరల్ కేటగిరి కోటాలో ఒక యూనిట్ మాత్రమే ఉందని ఈ యూనిట్లను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

లబ్దిదారుల పేర్లను చిట్టీలలో రాసి లాటరీ ద్వారా ఎంపిక చేస్తుండగా లబ్ధిదారులు మూకుమ్మడిగా 246 మంది దరఖాస్తులు చేసుకుంటే ఇద్దరికే యూనిట్లు కేటాయించడం ఏంటని ఆందోళనకు దిగి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి లబ్ధిదారుల పేర్లతో లాటరీ బాక్స్ ఉన్న చిట్టీలను లాక్కొని దహనం చేశారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకు రుణాలు అందించి ఆర్థిక చేయూత అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రత్యామ్నాయం లేక అధికారులు లాటరీ ఎంపిక విధానాన్ని వాయిదా వేశారు.


Next Story

Most Viewed