పాలేరుకు సీఎం కేసీఆర్​ వరాల జల్లు..

by Satheesh |   ( Updated:2023-01-18 14:09:00.0  )
పాలేరుకు సీఎం కేసీఆర్​ వరాల జల్లు..
X

దిశ, ఖమ్మం రూరల్: బీఆర్‌ఎస్ ​ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ ​పాలేరు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. రూరల్ మండలంలోని ఏదులాపురం, పెద్దతండా, నేలకొండపల్లి మండలా కేంద్రానికి ఒక్కొ పంచాయతీకి రూ. 10కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, మిగిలిన పంచాయతీలకు సైతం ఒక్కొ పంచాయతీకి రూ. 10లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పాలేరు నియోజకవర్గంలో గల పంచాయతీలకు నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేదంర్​ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏదులాపురం, పెద్దతండాలకు పదికోట్లు చొప్పున నిధులు విడుదల చేయడంతో పంచాయతీలో సీసీ రోడ్లతో పాటు మౌలిక వసతులు కల్పనకు అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు చెక్​ పెట్టినట్లైందని చెప్పాలి.



Next Story

Most Viewed