- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ.. ఏపీ పరిస్థితులపై సీఎం కేసీఆర్ మళ్లీ సెటైర్స్
దిశ, వెబ్ డెస్క్: డబుల్ రోడ్ వస్తే తెలంగాణదని, సింగిల్ రోడ్ వస్తే ఏపీదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్స్ వేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ, రోడ్లను ఖమ్మం జిల్లా ప్రజలు పరిశీలించాలని కోరారు. ఏపీ వాళ్లు చీకట్లో ఉన్నారని, కానీ తెలంగాణలో మాత్రం వెలుగులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఏపీ ధాన్యాన్ని తెలంగాణలో అమ్ముకుంటున్నారని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
కాగా ఏపీ పరిస్థితులపై సోషల్ మీడియాలో ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లకు సంబంధించిన ఫొటోలు చక్కెర్లు కొడుతున్నాయి. కరెంట్ విషయంలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై అక్కడి ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అటు బీజేపీ, జనసేన నేతలు కూడా బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ సైతం ఏపీలో పరిస్థితులపై విమర్శలు కురిపించారు. గతంలోనూ మంత్రి కేటీఆర్, హరీశ్ రావు లాంటి నేతలు సైతం ఏపీలోని రోడ్ల పరిస్థితులపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ నేతల నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుందో చూడాలి.