ఘనంగా హోమ్ గార్డ్స్ రైజింగ్ డే

by Disha Web Desk 15 |
ఘనంగా హోమ్ గార్డ్స్  రైజింగ్ డే
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రపురం నందు హోంగార్డ్స్ 60వ రైజింగ్ డే వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి పాల్గొన్నారు. ముందుగా జిల్లా ఎస్పీ హోంగార్డ్స్ ప్లాటూన్ కమాండర్ ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలోని హోమ్ గార్డ్స్ నాలుగు ప్లాటూన్స్ గా ఏర్పడి రైజింగ్ డే పరేడ్ ను నిర్వహించడం జరిగింది. పరేడ్ అనంతరం ఎస్పీ పూలతో సుందరంగా తయారుచేసిన వాహనంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, పరేడ్ కమాండర్ శేషు శ్రీనివాస్ లతో కలిసి ప్లాటూన్స్ ను వీక్షించారు. అనంతరం రైజింగ్ డే ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో హోమ్ గార్డ్స్ సేవలు అభినందనీయమని అన్నారు. పోలీస్ శాఖలో అంతర్భాగమై పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న హోంగార్డ్స్ ఆఫీసర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వరదల నేపథ్యంలో కూడా నిరంతరం విధులు నిర్వర్తించి ప్రజలకు అండగా ఉన్న హోంగార్డ్స్ సేవలు అమోఘమని అన్నారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం హోంగార్డ్స్ వారి సమస్యలను ఎస్పీ కి తెలియజేశారు. వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలియజేశారు. 60వ రైజింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను హోమ్ గార్డ్స్ అందరితో కలిసి కట్ చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా విధులలో ప్రతిభ కనబరిచిన 54 మంది హోమ్ గార్డ్స్ కు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డి.శ్రీనివాసరావు, కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్ బాబు, ఎస్బి ఇన్స్పెక్టర్ స్వామి,హోమ్ గార్డ్స్ ఆర్ఐ సుధాకర్,వెల్ఫేర్ ఆర్ఐ కామరాజు,ఆర్ఐ ట్రైనింగ్స్ నాగేశ్వరరావు,ఆర్ఐ ఆపరేషన్స్ ప్రసాద్ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed