సత్తుపల్లి లో గెలుపు బీఆర్ఎస్ దే

by Sridhar Babu |
సత్తుపల్లి లో  గెలుపు బీఆర్ఎస్ దే
X

దిశ,సత్తుపల్లి : కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ప్రచారాన్ని నమ్మొద్దని, సత్తుపల్లిలో గెలుపు బీఆర్ఎస్ పార్టీ దే అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సత్తుపల్లి పట్టణ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సత్తుపల్లిలో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అయిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఎన్నికలకు సహకరించిన నాయకులకు,

కార్యకర్తలకు, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు, ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఎన్నికల్లో 89 శాతం ఓట్లు పోలవగా 2023లో 87.43 గా నమోదు అయినట్టు తెలిపారు. కేవలం 2 శాతం తేడా ఉందని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మోనార్క రఫీ, మండల పార్టీ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, సర్పంచుల సంఘం అధ్యక్షులు మందపాటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శీలపురెడ్డ హరికృష్ణ రెడ్డి, కల్లూరు సర్పంచ్ లక్కినేని రఘు, పాలెపు రామారావు, రెడ్డం వీర మోహన్ రెడ్డి, కనగాల వెంకట్రావు, పాల వెంకటరెడ్డి, ఐదు మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు ,జెడ్పీటీసీలు, మండలాల అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



Next Story

Most Viewed