కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ సర్పంచ్

by Sridhar Babu |
కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ సర్పంచ్
X

దిశ, పెనుబల్లి : మండల పరిధిలోని రామచంద్రరావు బంజర్ గ్రామ సర్పంచ్ వాసం రాణి బీఆర్ఎస్ పార్టీని విడిచి గురువారం అలుగోజు చిన్నస్వామి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్ బాటలోనే తాను కూడా అంటూ ఉపసర్పంచ్ యలమంచి కల్పన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చిన్న స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు ఆకర్షితులై సర్పంచ్, ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ మేనిఫెస్టోను గ్రామంలోని ప్రజలందరి దృష్టికి తీసుకొని వెళ్తున్నామని తెలిపారు. త్వరలోనే గ్రామం మొత్తం జనాభాలో 70 నుండి 80 శాతం మందిని కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ప్రణాళిక తయారు చేసినట్టు తెలిపారు.



Next Story

Most Viewed