కూలీల అవతారం ఎత్తిన బీఆర్ఎస్ నాయకులు

by Sumithra |
కూలీల అవతారం ఎత్తిన బీఆర్ఎస్ నాయకులు
X

దిశ, భద్రాచలం : ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ జయప్రదం కోరుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు కూలి పని చేసి నిధులు సమీకరించారు. భద్రాచలం పట్టణంలోని రామదాసు సామిల్లులో కూలి పనులు చేశారు. సామిల్లు యజమాని తుమ్మలపల్లి ధనేశ్వరరావు కొంత నిధిని పార్టీ కార్యకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కొల్లం జయ ప్రేమ కుమార్, అంబటికర కృష్ణ, చిట్టి మల్ల అనిల్, కొలిపాక శివ, ఎస్కే అబ్దుల్ ఖాదర్, నాగ సాయి మహిళా నాయకులు సలోమి, తెల్లం రాణి తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed