పేద ప్రజల కోసం బీజేపీ రావాలి

by Disha Web Desk 15 |
పేద ప్రజల కోసం బీజేపీ రావాలి
X

దిశ, ఇల్లందు : పేద ప్రజల కోరిక నెరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం నీరజ్ కుమార్ సింగ్ అన్నారు. ఇల్లందు లోని మిరియాల వెంకటేశ్వర్లు ఇంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సీనియర్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన జనసంపర్క్ అభి యాన్ లో భాగంగా నెల రోజులు దేశంలో బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలియపరుస్తామన్నారు. ప్రధాని మోడీ ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో కాశ్మీర్లో శాంతి పునరుద్ధరించబడి ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు టూరిజం రద్దీ పెరిగి అనేక వర్గాల ఆదాయం పెరిగిందన్నారు.

జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతమై దేశవ్యాప్తంగా రోజుకు 29 కిలోమీటర్ల రహదారులు నిర్మాణం జరుగుతుందన్నారు. విద్యుత్ గ్రిడ్స్ అనుసంధానంతో దేశంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాతో వ్యవసాయ ,పారిశ్రామిక రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కమిషన్ల సర్కార్ ను సాగనంపి డబుల్ ఇంజన్ సర్కార్ ను తీసుకురావాలని కోరారు. సీతారామ ప్రాజెక్ట్ కాలువ రీ డిజైన్ చేసి నియోజకవర్గానికి అన్యాయం చేసినా స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొంతమంది దోపిడీకి గురైందని,

ఉద్యమానికి ఊపిరిలూదిన అనేకమంది నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురై దైన్యమైన జీవితాలు గడుపుతుంటే ,ఏనాడు కూడా జై తెలంగాణ అనని వారు రాజభోగాలు అనుభవిస్తున్నారని, భాజపాకి అధికారమిచ్చి ఉద్యమకారులు కలలుగన్న నిజమైన బంగారు తెలంగాణ సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నాళ్ళ సోమసుందరం, జిల్లా నాయకులు రామచంద్రనాయక్, రంగా కిరణ్, బాలగాని గోపి, ముక్తి శ్రీనివాస్ రెడ్డి ,హతి రామ్ నాయక్, ఖాజా, ఈసం వెంకటేశ్వర్లు, జస్వంత్ కుమార్, మాధవ్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed