- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
సమస్యలకు నిలయంగా ఆ మండల బీసీ హాస్టల్స్.. రెండు హాస్టళ్లకు కలిపి ఒక్కరే వార్డెన్
దిశ, ఎడ్యుకేషన్ ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం క్రిష్టారం బీసీ హాస్టల్లో, కల్లూరు మండలం, కల్లూరు గ్రామ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ బాలుర బీసీ వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. రెండు హాస్టల్లో కలిపి సుమారు 120 మంది విద్యార్థులు మూడవ తరగతి నుంచి పదో తరగతి వరకు బాలుర వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం రెండు హాస్టల్లో కలిపి ఒక్కరంటే ఒక్కరే విద్యార్థి ఉన్నట్లు తెలుస్తుంది. అధికారిక రికార్డులలో మాత్రం 100% హాజరు నమోదు చేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.
ఇక్కడ పనిచేసే హాస్టల్ వార్డెన్ నెలకు ఒక్కసారి విధులకు హాజరవుతున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. వసతగృహాలకు రక్షణగా ఉండి, విధులు నిర్వర్తించవలసిన నైట్ వాచ్‌మెన్లు ఓ ప్రైవేట్ వ్యక్తులను పురమాయించి విధులు సక్కబడుతున్నట్లు తెలుస్తుంది. విద్యార్థులు స్నానాలు చేసే బాత్రూమ్స్ అధ్వానంగా ఉన్నాయి. మురుగు విపరీతంగా పేరుకుపోయింది. దీనివలన బాత్రూమ్స్ నుంచి దుర్వాసనను వస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. కనీసం నెలకు ఒక్కసారైనా బాత్రూమ్స్ ను హాస్టల్ వార్డెన్ శుభ్రం చేయించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.
ఇక్కడ పనిచేసే హాస్టల్ వార్డెన్ కు కల్లూరు కేంద్రంగా నడపబడుతున్న ప్రభుత్వ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహంకి కూడా ఇన్చార్జిగా ఉన్నట్టు తెలుస్తుంది. హాస్టల్ వార్డెన్ను దిశ ప్రతినిధి వివరణ కోసం ఫోన్లో సంప్రదించగా సమాధానం ఇవ్వటం లేదు. కల్లూరు డివిజన్లో ఉన్న బీసీ హాస్టల్లను పర్యవేక్షించవలసిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే, ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుకుంటున్నాయి.
విధుల విషయంలో అలసత్వం వహిస్తే సహించం
ఇక్కడ పనిచేస్తున్న హాస్టల్ వార్డెన్ విధులకు హాజరవ్వట్లేదని మా దృష్టిలో కూడా ఉంది. హాజరవ్వాలని పలుమార్లు హెచ్చరించాం. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోతాం.
దారా నరసయ్య,
అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్, కల్లూరు డివిజన్.