దసరా కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ..

by Dishafeatures2 |
దసరా కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ..
X

దిశ, ఇల్లందు: ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇల్లందు ఎమ్మార్వో కృష్ణవేణి అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇల్లందు 54, కామేపల్లి 33 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా ఇల్లందు మండలంలో 21,866, ఇల్లందు పట్టణంలో 17,723, కామేపల్లి మండలంలో 10,050 చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు. పేదింటి ఆడపడుచులకు పెద్దన్నలా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా చేదొడులా ఉంటున్నారని అన్నారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందేలా చూస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాల వారు కూడా అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పుతారని, జాతీయ స్థాయిలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని అన్నారు. కరోనా కాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపకుండా ధైర్యంగా ముందుకు సాగారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పిటిసి ఉమాదేవి, టిఆర్ఎస్ పట్టణ ఇంచార్జి యలమద్ది రవి, పులిగండ్ల మాధవరావు, వైస్ చైర్మన్ జానీ, వైస్ ఎంపీపీ ధ్యాసం ప్రమోద్, గిన్నారపు రాజేష్, ఎంపీడీవో అప్పారావు, కామేపల్లి ఎమ్మార్వో, సర్పంచులు ,ఎంపీటీసీలు ,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed