జర్నలిస్టుల పై దాడి అమానుషం : వీరు గౌడ్

by Disha Web Desk 20 |
జర్నలిస్టుల పై దాడి అమానుషం : వీరు గౌడ్
X

దిశ, ఖమ్మం టౌన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి చెందిన నాయకులు జర్నలిస్టుల పై చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు టేకుమట్ల వీరుగౌడ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మణుగూరులో బిగ్ టీవీ రిపోర్టర్ పై బీఆర్ఎస్ లీడర్ల దాడి అమానుషం అన్నారు. అధికార బలం ఉందని, ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా ఉండే నాలుగో స్తంభం అయిన జర్నలిస్ట్ ల పై, సామాన్యుల పై అధికారం మదంతో దాడులకు పాల్పడుతున్నారని ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రిపోర్టర్ పై దాడి చేసిన అధికార పార్టీ లీడర్ పై కేసునమోదు చేయాలని. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, పోలీసులు కేసునమోదు చేయాలని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed