- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ పై దాడి ఘటన.. కీచకుడి కోసం పోలీసుల వేట
ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ పరిధిలో మానవత్వాన్ని మంటగలిపే ఒక అత్యంత ఘోరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

X
దిశ, ఖమ్మం క్రైం : ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ పరిధిలో మానవత్వాన్ని మంటగలిపే ఒక అత్యంత ఘోరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన హృదయ విదారక ఘటన నగర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 6వ తేదీన ఒక అభం శుభం తెలియని 12 ఏళ్ల మైనర్ బాలికపై ఒక కామాందు రాక్షసుడు దారుణానికి ఒడిగట్టాడు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన వయసున్న ఆ బాలికపై కసాయివాడిలా ప్రవర్తించి సమాజం తలదించుకునేలా చేశాడు. శాంతిభద్రతలకు నిలయమైన నగరంలో ఇలాంటి అమానుష ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఘాతుకానికి పాల్పడింది ఒక లారీ డ్రైవర్. రాపర్తి నగర్ ప్రాంతంలో తిరుగుతూ ఉండే ఒక లారీ డ్రైవర్ ఆ బాలికను ఒంటరిగా చూసి కిరాతకానికి పాల్పడినట్లు సమాచారం. ఆ చిన్నారికి ఏం జరుగుతుందో తెలియకుండా అరుస్తున్న వినకుండా, తన పశువాంఛను తీర్చుకోవడానికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఎంతగా ప్రతిఘటించినా, రక్షించమని వేడుకున్నాఆ కామాంధుడి మనసు కరగలేదు కదా రాక్షసానందం పొందాడు. మృగంలా ప్రవర్తించిన ఆ లారీ డ్రైవర్, ఆ మైనర్ బాలికపై తన కర్కశత్వాన్ని పూర్తిగా ప్రదర్శించాడు.
పోక్సో కేసు కాకుండా ప్రయత్నాలు
ఈ దారుణమైన దాడి కారణంగా ఆ చిన్నారి శారీరకంగా, మానసికంగా తీవ్రమైన నరకాన్ని అనుభవించింది. నగరంలో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే మృగాలు తిరుగుతుండటం పట్ల మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత చేసి కూడా పొలిటికల్ నేతలతో మంతనాలు జరుపుతూ పొక్సో కేసు కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. నగర నడిబొడ్డులో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నగరంలో ముగ్గురు మాజీ కార్పొరేటర్ల సాయంతో పోక్సో కాకుండా టూ టౌన్ పోలీసులతో మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన మాజీ కార్పొరేటర్ లు ఆ వ్యక్తిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారు అనే సందిగ్ధం పలువురి మెదడులో నానుతుంది. ఇక లైంగిక దాడి జరిగిన తర్వాత సాక్ష్యం లేకుండా చేసేందుకు బాలిక ప్రాణాలతో ఉంటే తన విషయం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఎలాగైనా ఆ బాలికని అంతమొందించి సాక్ష్యాలు లేకుండా చేయాలని ఆ వ్యక్తి ఒక దుర్మార్గానికి పాల్పడ్డాడు. వెంటనే ఆ బాలికను సమీపంలోని ఒక భవనం పైకి తీసుకెళ్లి, అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా కిందకు తోసేశాడు. పైనుంచి కిందపడితే బాలిక చనిపోతుందని, దాంతో ప్రమాదవశాత్తు పడిపోయిందని నమ్మించవచ్చని భావించాడు. ఈ ఘోరానికి ఒడిగట్టిన వెంటనే ఆ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
బాలిక ప్రాణంతో చెలగాటం....
భవనం పైనుంచి బాలిక ఒక్కసారిగా కింద పడటంతో ఆ మైనర్ బాలికకు అత్యంత తీవ్రమైన గాయాలయ్యాయి. కింద పడడంతో బాలిక వెన్ను ముక విరిగింది అని, చేతులు, తలకు బలమైన గాయాలు అయినట్లు వైద్యులు చెబుతున్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి మాజీ మంత్రి పువ్వాడ....
మైనర్ బాలికపై అత్యాచారం చేసి మూడంతస్తుల భవనం పై నుంచి తోసేసిన మెంతి తోడు గౌస్ ను తీవ్రంగా శిక్షించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిందితులకు శిక్ష పడడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు ప్రలోభాలకు గురికాకుండా తక్షణం బాలికకు బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూడాలని అజయ్ కుమార్ కోరారు.
మహిళలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం...
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరావు ఆరోపించారు. హిందూ మహిళలు కనబడితే పైశాచిక ఆనందం పొందుతున్నారని అందులో భాగంగానే దేశవ్యాప్తంగా హిందూ మహిళా ల పైనే దాడులు జరుగుతున్నాయని మైనర్ బాలికపై అత్యాచారం చేసిన లారీ డ్రైవర్ గౌస్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






