బాధితులకు బాసటగా నిలిచేందుకు రైస్ మిల్లర్స్ ఏర్పాట్లు

by Sridhar Babu |
బాధితులకు బాసటగా నిలిచేందుకు రైస్ మిల్లర్స్ ఏర్పాట్లు
X

దిశ, ఖమ్మం సిటీ : మున్నేరు ఉప్పొంగడంతో నగరంలో పలు డివిజన్లలో వరదలతో ఎన్నో కుటుంబాలు ఇంటి సామగ్రి అంతా పోగొట్టుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకోవడానికి ఎంతోమంది సహృదయులు ముందుకు వస్తున్నారు. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 4.40 లక్షల విలువచేసే 100 క్వింటాళ్ల నాణ్యమైన బియ్యాన్ని 1000 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 కిలోలు అందజేస్తున్నట్లు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు తెలిపారు. ఈ బియ్యాన్ని నగరంలోని ముంపు బాధితులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన అన్నారు. అసోసియేషన్ కార్యదర్శి జువ్వాజి నగేష్, కోశాధికారి సీహెచ్. నగేష్, మధు, బాలకృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.



Next Story

Most Viewed