- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బాల వెలుగు పాఠశాలలో అన్నదానం..

దిశ, వైరా: వైరా కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎన్ఆర్ఐ వేమూరి అజయ్ కుమార్, చైతన్య ల కుమార్తె అక్షయ్ చౌదరి పుట్టినరోజు సందర్భంగా వైరా లోని బాల వెలుగు పాఠశాలలో వేమూరి అజయ్ అనాధ బాల బాలికలతో కలిసి కేక్ కట్ చేయించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. వేసవి కాలం కావడంతో ఉక్కపోత ఉందని అని అడగగానే కూలర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వేమూరి అజయ్ మాట్లాడుతూ.. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా బాల వెలుగు పాఠశాలలో అన్నదానం నిర్వహించడం సంతోషంగా ఉందని.. అనాధ పిల్లల మధ్య తన కుమార్తె పుట్టినరోజు వేడుకలు చేయడం ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనాధ పిల్లల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కర్నాటి హనుమంతరావు, మరికంటి శివ, సూర్యదేవర శ్రీధర్, ఎంపీటీసీ మట్టూరి కృష్ణారావు, శీలం వెంకట నర్సిరెడ్డి, గింజుపల్లి జనార్ధన్, విజయ్, హరి బ్రహ్మారెడ్డి, ఉదయ్, ప్రసాద్, శ్రీమంతు పల్లపు కొండల్, తదితరులు పాల్గొన్నారు.