విత్తన డీలర్ పై చర్యలు తీసుకోవాలి

by Disha Web Desk 1 |
విత్తన డీలర్ పై చర్యలు తీసుకోవాలి
X

దిశ, తిరుమలాయపాలెం: నకిలీ మిర్చి విత్తనాలు విక్రయించిన డీలర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు, రైతులు సోమవారం ఖమ్మం కలెక్టర్ వీపీ.గౌతమ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల పరిధిలోని బచ్చోడుతండాకు చెందిన కొంత మంది రైతులు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో వెంకటసాయి సీడ్స్ నుంచి లక్ష్మీ హాట్, జమున హైబ్రిడ్ సన్న రకం మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి మిరప తోట సాగును చేశారు. రూ.లక్షల పెట్టుబడులు పెట్టిన మిరప తోటకు కాపు కూడా రాలేదు. అక్కడక్కడా వచ్చిన లావు కాయలు కాస్తున్నాయని, మండల వ్యవసాయ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ పంటను పరిశీలించి సన్న రకం విత్తనాలు కాదని ధ్రువీకరించారని తెలిపారు. గిరిజన రైతులు భూమిని కౌలుకు తీసుకొని, రూ.లక్షల్లో పెట్టుబడి పెడితే నకిలీ విత్తనాలతో మోసపోయారని వారికి నష్ట పరిహారం అందించి నకిలీ విత్తనాలు విక్రయించిన డీలర్ పై చర్యలు తీసుకోవాలని సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బింగి రమేష్, రైతులు ధారవత్ పంతులు, భూక్యా భీమా, బాణోత్ ధన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed