- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆరోగ్య మహిళ తో సంపూర్ణ ఆరోగ్యం

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమం అన్ని వర్గాల మగువలకు మంచి అవకాశమని జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత అన్నారు. మంగళవారం ఆమె వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మహిళల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుని, ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మండల పరిధిలో మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మహిళలకు ఎనిమిది రకాల జబ్బులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 17 మంది రోగులను జిల్లా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం పంపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సంధ్యారాణి, డీఎంహెచ్వో మాలతి, సీడీపీఓ శారదా శాంతి, స్థానిక ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఉదయలక్ష్మి, దేవిశ్రీ, సీహెచ్ఓ ధనలక్ష్మి, ఎంపీఓ జోస్నాదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు మాలతి, సరిత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.