అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన యువతి

by Disha Web Desk 15 |
అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన యువతి
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో సముద్రాల మనోజ్ఞ అమెరికా నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. తెలంగాణలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకోవాలని వచ్చి తన ఓటు హక్కును వైరా మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో వినియోగించుకుంది. ఈ సందర్భంగా సముద్రాల మనోజ్ఞ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని ఆమె తెలిపారు.Next Story

Most Viewed