నకిలీ డెత్ సర్టిఫికేట్లతో బురిడీ.. అందులో రెవెన్యూ అధికారి హస్తం..?

by Disha Web Desk 12 |
నకిలీ డెత్ సర్టిఫికేట్లతో బురిడీ.. అందులో రెవెన్యూ అధికారి హస్తం..?
X

దిశ, ఖమ్మం రూరల్: రియల్ వ్యాపారం చేయడం సహజమే. కానీ బ్రతికి ఉన్నవాళ్ళను చనిపోయినట్లుగా నకిలీ ధృవీకరణ పత్రాలతో కేటుగాళ్ళు ఏకంగా ఐదు ఎకరాల భూమిని ఓ వ్యాపారికి చెందిన వ్యక్తులకు అంతగట్టిన వైనం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని తనగంపడు రెవెన్యూలో సర్వే నెంబర్ 43లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి భూమి ఉంది. అట్టి భూమి ఉన్నట్లు ఆయనకు కూడా తెలియకపోవడంతో కొంత మంది కేటుగాళ్ళు నేలకొండపల్లి కి చెందిన వ్యకికి అంటగట్టేందుకు పథకం రచించారు.

పట్టదారుడు మరణించినట్లు నకిలీ ధృవీకరణ పత్రము ఖమ్మం నగరంలో ఓ మీ సేవ నుంచి తయారు చేసి రెవెన్యూ అధికారిణి సహాయంతో పట్టా మార్పిడి చేశారు. తహసీల్దార్ కు తెలియకుండానే ఉప తహసీల్దార్ ఈ తంతు నిర్వహించినట్లు సమాచారం. మొదట నిరంజన్ రెడ్డి పేరు మీద మ్యుటేషన్ చేసి తరువాత మరొకరి పేరు మీద చేసారు. విషయం పలు పత్రికలలో రావడంతో తహసీల్దార్ సుమ విచారణ చేపట్టారు.

కేటుగాళ్ళు గూడురూపాడు కు చెందిన ఓ వ్యక్తి అన్ని తానై చేసుకున్నట్లు తెలిసింది. నకిలీ డెత్ సర్టిఫికెట్ దగ్గర నుంచి ఇతర వ్యక్తులకు మ్యుటేషన్ అయ్యేంతవరకు కూడా అతని చేతుల్లోనే నడిచింది. ఈ కుట్రలో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమ0లో నేలకొండపల్లి కి చెందిన వ్యాపారి గత నెల 4న తన ఇంట్లో ఇబ్బందులతో మత్తు టాబ్లెట్ మింగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు.

మరునాడు పలు పత్రికలలో మాత్రం నేలకొండపల్లి కి చెందిన ఓ వ్యాపారి రియల్ ఏజెంట్, వెబ్ రిపోర్టర్ చేతిలో మోసపోయినట్లు కథనాలు వచ్చాయి. దానికి స్పందించిన సదురు బాధితుడు నేను ఎవరి చేతిలో మోసపోలేదని లికితపూర్వకంగా లెటర్ కూడా ఇచ్చాడు. కానీ కావలెను ఓ పత్రికల్లో మాత్రం వెబ్ రిపోర్ట్ ఉన్నట్టు వ్యక్తిగతంగా రాస్తున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే పలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. తహసీల్దార్ సుమ విచారణ చేసి పై అధికారులకు పంపించినట్లు తెలిసింది.

Next Story