- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అకాల వర్షం.. తడిసిన వరి ధాన్యం

దిశ, తల్లాడ : అకాల వర్షం మరోసారి అన్నదాతను ఆగం చేసింది. ఆరబోసి అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం వాననీటి పాలైంది. కల్లాలలో కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ చేసిన ఓట్లు తడిసిపోయి తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఈదురు గాలులతో కూడిన వర్షంకు తల్లాడ మండలంలోని బిల్లుపాడు, రంగం బంజర, అంజనాపురం, ముద్దనూరు, పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ చేసిన ధాన్యం సుమారు 3000 ఎకరాల నిలువచేసిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కేంద్రాల్లో సరిపడా పట్టాలు లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోలేకపోయారు కొన్నిచోట్ల వడగండ్లు పడటంతో కోతకు వచ్చిన వరి దెబ్బతిన్నది. వడ్లు రాలిపోయాయి.. పొలాలు నేల కొరిగాయి. మొత్తంలో రైతులు నష్టపోయారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతన్న కోరుతున్నారు.
వానకు కొట్టుకుపోయిన వడ్లు.. ఏం చేయాలో అర్థం కాక రైతన్న..
తల్లాడ మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది. బిల్లుపాడు గ్రామం వద్ద రేజర్ల గ్రామ ప్రాంతంలో రైతులు కేంద్రానికి తెచ్చిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. తడవకుండా కాపాడుకోవడానికి రైతులు అవస్థలు పడినా లాభం లేకపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతును కోరారు.
రాయల లక్ష్మయ్య బిల్లుపాడు గ్రామ వాసి రైతు...
సుమారు మా గ్రామంలో 250 ఎకరాలు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కోసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు తీసుకొచ్చాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వస్తుంది. ఎండే క్రమంలో సాయంత్రం ఒక్కసారిగా వడగండ్ల వాన రావడంతో మా కాడ ఉన్న పట్టాలు వడ్లరాసుల పై ఏసేలోపే ఒక్కసారిగా వర్షం పడటంతో వడ్లు ముద్దముద్దగా తడిసిపోతున్నాయి. ఇది చూసిన దళారులు తడిసిన ధాన్యాన్ని ఎలా కొంటామని చెప్తున్నారు. సొసైటీ వద్ద గోనె సంచులు ఇవ్వమంటే స్టాకు లేదు అంటున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ తల్లాడ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా అలాగే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం.
ఉరుకులు..పరుగులు : ఇంజాం వీరభద్రరావు రేజర్ల గ్రామవాసి రైతు..
మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిచింది రైతులు వడ్లు కుప్పల పై కప్పేందుకు టార్పాలిన్ కవర్లు కోసం ఉరుకులు.. పరుగులు పెట్టారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడక కవర్లు లేకపోవడంతో ధాన్యం తడిసింది. మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది.. తూకం వేయడంలో జాప్యం కారణంగానే వడ్లు తడిసిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.