ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

by Shiva |
ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
X

దిశ దమ్మపేట: దమ్మపేట మండల కేంద్రంలోని నెమలిపేట గ్రౌండ్ లో నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని అశ్వారావుపేట నియోజకవర్గ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు జారే ఆదినారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు 6వేల మంది పైగా పొంగులేటి అభిమానులు కార్యక్రమానికి హాజరబోతున్నారని తెలిపారు. సభకు హాజరయ్యే వారందరికీ పసందైన విందు భోజననాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సభ విజయవంతం చేసేందుకు గాను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలానికి ఇద్దరు కోఆర్డినేటర్లు, ప్రతి పంచాయతీని రెండు క్లస్టర్లుగా విభజించి,104 మంది పొంగులేటి అనుచరులు కృషి చేస్తున్నారని జారే ఆదినారాయణ తెలిపారు.

Next Story

Most Viewed