పోలీస్, అటవీ అధికారుల మీటింగ్.. పోడు వ్యవహారాలపై చర్చ

by Dishafeatures2 |
పోలీస్, అటవీ అధికారుల మీటింగ్.. పోడు వ్యవహారాలపై చర్చ
X

దిశ/జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు అటవీ కార్యాలయంలో అటవీ అధికారులు, పోలీసులు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. చండుగొండ మండలం ఎర్రబోడులో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే విషయంలో జూలూరుపాడు సీఐ వసంత్ కుమార్, ప్రసాదరావు ఆధ్వర్యంలో అటవీ ఉద్యోగులు చర్చించారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై మాట్లాడారు. జూలూరుపాడు మండల వ్యాప్తంగా అటవీ అధికారులకు గొత్తికోయలతోపెద్ద సమస్యలు లేకపోయినా.. ఇటీవలి ఘటన నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లోకి వెళ్లేటప్పుడు అటవీ అధికారులు పోలీసుల సహకారం తీసుకోవాలని సీఐ వసంత్ కుమార్ సూచించారు.

అనంతరం ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు ఆధ్వర్యంలో హత్యకు గురైన శ్రీనిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు అటవీ కార్యాలయంలో అటవీ అధికారులు, పోలీసులు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.సరావు చిత్రపటం వద్ద నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎస్సై గణేష్ తో పాటు పోలీస్, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed