గ్రామాల్లో ఘనంగా చెరువు పండుగ

by Sridhar Babu |
గ్రామాల్లో ఘనంగా చెరువు పండుగ
X

దిశ, ఖమ్మం రూరల్​ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రూరల్​ మండలంలో ప్రతి గ్రామంలో చెరువు పండుగ ఘనంగా జరిగింది. ఆయా పంచాయతీల్లో స్పెషల్​ అఫీసర్​లు, సర్పంచ్​లు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో బతుకమ్మలను ఎత్తుకుని వచ్చి ఆటపాటలతో చెరువు కట్టల వద్ద సందడి చేశారు. బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటి ద్వారా జరిగిన అభివృద్ధిని అధికారులు వివరించారు. మిషన్​కాకతీయలో చెరువులకు మహర్థశ పట్టిందన్నారు. కాగా కొంపురంలో జరిగిన చెరువు పండుగలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి పాల్గొని కోలాటం చేశారు. అనంతరం భోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, ఇరిగేషన్​ సీఈ శంకర్​నాయక్​, ఎంపీడీవో అశోక్​కుమార్​, తహసీల్దార్​ టి. సుమ, ఎంపీవో రాజారావు, సుడా డైరెక్టర్​ సంజీవరెడ్డి, సర్పంచ్​లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed