ప్రభుత్వ పాఠశాలలో రణరంగం

by Disha Web Desk 15 |
ప్రభుత్వ పాఠశాలలో రణరంగం
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : కొత్తగూడెం బాబుక్యాంపు లోని ప్రభుత్వ హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్ బాలికలు మంగళవారం ఉదయం స్కూల్ కు వెళ్తున్నాం అని చెప్పి బయటకు వెళ్లారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. దీంతో ఎక్కడ వేతికినా విద్యార్థినిల ఆచూకీ తెలియకపోవడం తో ఎప్పటికైనా స్కూల్ కి తిరిగి వస్తారు అని వేచి చూస్తున్న కుటుంబ సభ్యులకు సాయంత్రం ఆటోలో ఇద్దరు యువకులతో తిరిగి వస్తున్న వారి పిల్లలను చూశారు. దాంతో వారి కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులై ఆ యువకులను చితకబాదారు. దీన్ని అదునుగా భావించి అదే బస్తికి చెందిన మరి కొందరు కూడా అక్కడికి వచ్చి దాడి చేయడంతో ప్రాణ భయంతో పరుగులు తీసిన యువకులు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గదిలో తలదాచుకున్నారు. విషయం తెలుసుకుని బస్తీవాసులు అక్కడ కూడా దాడి చేసి ఫర్నిచర్, కంప్యూటర్ ధ్వంసం చేసి రణరంగం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.



Next Story