రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

by S Gopi |
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
X

దిశ, దమ్మపేట: మండల పరిధిలోని ముష్టిబండ గ్రామంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ముష్టిబండ గ్రామానికి చెందిన దూతుకు సుబ్బయ్య (75) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా సత్తుపల్లి వైపు నుండి మందలపల్లి వైపు వస్తున్న ఓ ద్విచక్ర వాహనం వృద్ధుడిని ఢీకొట్టడంతో సుబ్బయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన గ్రామస్తులు అంబులెన్స్ సహాయంతో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.



Next Story

Most Viewed