5 టన్నుల బొగ్గు పట్టివేత

by Sridhar Babu |
5 టన్నుల బొగ్గు పట్టివేత
X

దిశ,ఇల్లందు : రైల్వే వ్యాగన్ల ద్వారా తరలిపోతున్న బొగ్గును దొంగిలించి అక్రమంగా తరలిస్తుండగా సింగరేణి సెక్యూరిటీ స్పెషల్ టీమ్ సోమవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సీహెచ్పి నుండి బొగ్గులోడుతో వెళ్లే రైల్వే వ్యాగన్ లోని బొగ్గును మూసి వేయబడిన రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు బొగ్గు దొంగలు కాపు కాసి దొంగలిస్తున్నారని సమాచారం

మేరకు నిఘా పెట్టిన సింగరేణి స్పెషల్ టీమ్ సుమారు 120 పైగా బొగ్గు బస్తాలను పట్టుకున్నట్లు సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్ అంజిరెడ్డి తెలిపారు. పట్టుబడిన బొగ్గు దాదాపు 5 టన్నుల వరకు ఉంటుందన్నారు. బస్తాల్లో నింపుకున్న బొగ్గును బొలెరో క్యాంపెన్ వాహనంలో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. బొగ్గుతో పాటు వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకొని సెక్యూరిటీ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు. బొగ్గు దొంగలు పారిపోయారని, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Next Story