21 లక్షల విలువ చేసే.. 350 కేజీల గంజాయి స్వాధీనం

by Dishanational4 |
21 లక్షల విలువ చేసే.. 350 కేజీల గంజాయి స్వాధీనం
X

దిశ, ఇల్లందు: ఒరిస్సా నుండి మహారాష్ట్రకు కారులో తరలిస్తున్న 350 కేజీల గంజాయిని ఇల్లందు సీఐ బానోత్ రాజు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీ, ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన సీలేరు నుండి 350 కేజీల గంజాయిని 70 ప్యాకెట్లలో మహారాష్ట్ర, సోలాపూర్‌కు చెందిన సాగర్ దుక్కడ్ కలాం, ఆనంద్ బాలాజీ మక్కాడ్, అమూల్ రాందాస్ అనే ముగ్గురు వ్యక్తులు ఇన్నోవా కారులో గంజాయి తరలిస్తున్నట్లు తెలిపింది. విషయం తెలుసుకున్న భద్రాచలం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంబడించగా.. వాహనాన్ని ఆపకుండా అధిక వేగంతో సారపాక వద్ద భారీ కేట్లను గుద్దుకుంటూ తప్పించుకున్నారు.

భద్రాచలం ఎక్సైజ్ అధికారులు పాల్వంచ, ఇల్లందు ఎక్స్చేంజ్ అధికారులకు సమాచారం అందించగా ఇల్లందు ఎక్సైజ్ సీఐ రాజశేఖర్, ఇల్లందు సీఐ బానోతు రాజు ఆధ్వర్యంలో.. కరెంట్ ఆఫీస్ ఏరియా వద్ద పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ వాహనం వారి నుండి తప్పించుకొని బాబు అనే కానిస్టేబుల్ గాయపరిచి అతివేగంతో ఇల్లందులోని కొత్త బస్టాండ్ ఏరియాలో కరెంట్ పోల్‌కు గుద్దుకొని వాహనం ఆగిపోయింది. వెంటనే ఇల్లందు సీఐ బానోతు రాజు వాహనంలోని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమణమూర్తి, ఎక్సైజ్ ఎక్స్పరిమెంట్ సూపర్డెంట్ తిరుపతి మాట్లాడుతూ.. ఆ గంజాయి 350 కేజీల విలువ సుమారు 21 లక్షల ఉంటుందని, దానిని వారు ఒరిస్సా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఎక్స్చేంజ్ అధికారులు పాల్గొన్నారు.


Next Story