- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ పై దారుణం.. అపార్ట్‌మెంట్ పైకి తీసుకెళ్లి లైంగిక దాడిచేసి..
ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై దారుణ ఘటన జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి.. ఆమెపై బలవంతంగా లైంగికదాడి చేశాడో కామాంధుడు.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై దారుణ ఘటన జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి.. ఆమెపై బలవంతంగా లైంగికదాడి చేశాడో కామాంధుడు. అనంతరం కనికరం లేకుండా ఆ బాలికను భవనం పైనుంచి తోసేశాడు. దీంతో బాలిక వెన్నెముక, చేతులు, కాళ్లు, పక్కటెముకలకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాలికను ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు బాలికకు చికిత్స అందిస్తున్నారు. బాలిక కుటుంబం నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లో ఉంటున్న వ్యక్తే లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన ఈనెల 6వ తేదీనే జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. తొలుత బాలిక ప్రమాదవశాత్తూ కిందపడిపోయిందని తల్లిదండ్రులు భావించారు. ఆస్పత్రిలో వైద్యపరీక్షల తర్వాత అసలు విషయం తెలిసి షాకయ్యారు. బాలిక తన తల్లిదండ్రులకు చెప్పిన విషయాల ఆధారంగా తమ అపార్ట్మెంట్లో ఉంటోన్న వ్యక్తే ఘాతుకానికి ఒడిగట్టాడని గ్రహించి.. ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. దీనిపై బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.






